Saturday, July 27, 2013

నేవు !

     మందహాసానికి మారు పేరు నువు అని అంటారు అందరూ. కానీ, ఏమరపాటులో ఎక్కడ నీ మనసులో భావాలు ముఖంలో కనపడుతాయో అనే భయంతో, దానిని దాచే ప్రయత్నమే నీ చెరగని చిరునవ్వు అని తెలిసింది ఎందరికి?       నీకు తప్ప!

     దేవుని నమ్మవు, దేనికోసమూ ప్రార్ధించవు అంటారు అందరూ. ఒక సగటు మనిషి తన జీవితంలో ఎన్నిసార్లు దేవుని ప్రార్థిస్తాడో అంతకంటే ఎక్కువసార్లు ఇప్పటికే దేవుని సాయం కోరావని, ఇపుడు కొత్తగా ఫలితంలో ఆశించే మార్పు ఏమీ లేదనీ తెలిసేది ఎందరికి? నీకు తప్ప!

     దేనికీ, ఎవరికీ భయపడవనీ, ఆకాశం మీద పడినా ఫర్వాలేదు అన్నట్లుంటావనీ అనుకొంటారు అందరూ. ఏదైనా కొల్పోయేదుంటేనే ఎవరైనా భయపడుతారనీ, అలాంటివేమీ లేనివాడికి భయం కూడా ఉండదని తెలిసేది ఎవరికి?         నీకు తప్ప!

     ఎప్పుడూ హుషారుగా, సరదాగా ఉండే నీవు అప్పుడపుడూ పరధ్యానంలో మునిగిపోతావనీ అనుకొంటారు అందరూ. అసలు నిజ ప్రపంచంలోకే నువు అతిథిలా వస్తావని, పరధ్యానం అనుకొంటున్న ఆ మరోప్రపంచమే నీ అసలు ప్రపంచమని తెలిసింది ఎందరికి? నీకు తప్ప!

     నీ మనసొక తెరచిన పుస్తకమనీ, నిను చదవటం చాలా సులువనీ అనుకొంటారు నిను తెలిసినవారు. వారు చదువగలిగేది అక్షరాలు మాత్రమే అని, వాటి వెనుక అర్ధాలు కాదనీ తెలిసేది ఎందరికి? నీకు తప్ప!

     కలల జగతిలో అలుపెరుగక పోరాడే ఓ నేస్తమా, నీ ప్రయాస దేనికోసమో తెలుపుమా!


6 comments:

  1. అందరిలో కొందరిని తీసి , అందరూ కొందరు ఐతే ఇంకా బాగుండును..!

    ReplyDelete
    Replies
    1. 'Chalaa mandi' anna padam raayaalsindi akkada. 'Andaru' koncham suit ayindi ani daniki settle ayya. :)

      Delete
  2. eppatilane english lo nuv rase blog chadavalemo ani open chestaru andaroo..

    Kani eesari nee matrubhashalo rasina ee page, nee antharangam londi veluvadimdani telisedhi endariki? neeku naaku thappa? :P

    ReplyDelete
  3. what am i supposed to understand from this ;)

    ReplyDelete
    Replies
    1. There are a lot of things, I will try to translate and send in a mail. Most of the things were part of our discussions (or arguments I should say :P) last year. :)

      Delete